చిత్రం చెప్పే విశేషాలు

(12-10-2023/3)

అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌ ప్రావిన్స్‌లో మరోసారి 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇటీవలి భూకంపంలో 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఈ సారి ప్రాణ నష్టం జరగలేదు.

 ఫిల్మ్‌నగర్‌లో డిజైనర్‌ విద్యార్థులు తయారు చేసిన కోషా ఇంటీరియర్‌ డిజైనర్‌ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. వివిధ రకాల వస్తువులు, బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. 

తమ దేశంలో నరమేధానికి పాల్పడిన హమాస్‌ను నామరూపాల్లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధమైంది. ఉగ్రమూకలకు కేంద్రమైన గాజాపై బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో గాజా నగరం అల్లకల్లోలంగా మారింది.

తెలంగాణలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆటపాలతో సందడి చేశారు.

దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గత ఆరు మాసాల నుంచి నగరంలోని బర్కత్పురా ప్రాంతంలో కలకత్తాకు చెందిన కేకే మండల్ బృందం అమ్మవారు అలంకరణలో విగ్రహాలను రూపుదిద్దుతున్నారు. 

సంతనూతలపాడు ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా పోటీలు జరిగాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఆటలు ఆడారు. 

 శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో సినీ తారలు అనసూయ, మెహ్రీన్‌ సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

 వేసవికాలంలో ఉన్నట్లుగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు అల్లల్లాడుతున్నారు. ఈ తరుణంలో మేతకై వచ్చిన మూగజీవాలు ఎండకు తట్టుకోలేక ఇలా చెట్టునీడలో సేదతీరుతున్నాయి. 

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు(04-12-2023/3)

చిత్రం చెప్పే విశేషాలు (04-12-2023/2)

Eenadu.net Home