చిత్రం చెప్పే విశేషాలు
(14-10-2023/2)
కోడిగుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయని, ప్రతిరోజు అందరూ ఆహారంలో గుడ్డు భాగం చేసుకోవాలని వైద్యులు సూచించారు. శుక్రవారం ‘వరల్డ్ ఎగ్ డే’ సందర్భంగా పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పం వేసి గుడ్డు తినాలని చైతన్యం కల్పించారు.
కొత్తగూడలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ వసతిగృహంలో వింత ఆకారంలోని సీతాకోక చిలుక కనిపించింది.. సాధారణం వాటికి భిన్నంగా ఆర్మీ జవానుల ఏకరూప దుస్తులు ధరించినట్లు ఇది ఉంది. వింత వింత ఆకారాలు, రంగుల్లో ఉన్న సీతాకోక చిలుకలు అరుదుగా కనిపిస్తుంటాయి.
దేవాలయం పక్కన మైదానంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో నాయినేని శ్రీనయన బంగారు బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివేకానందనగర్‌వాసి నాయినేని సూర్యారావు తమ మనవరాళ్లు శ్రీనయన, వైష్ణవిపై ప్రేమతో గతేడాది కిలో బంగారంతో ఈ బతుకమ్మను ప్రత్యేకంగా తయారుచేయించారు.
మహిళలకు, పిల్లలకు అత్యంత ప్రీతికరమైన బతుకమ్మ పండుగ వచ్చేసింది. పల్లె నుంచి పట్నం వరకు చిన్నా పెద్ద అందరూ కలిసి తొమ్మిది రోజులు ఆడుకునే పూల పండగ ఇది. మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూవు బతుకమ్మ అంటారు. ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం కలిపి ముద్దలు చేస్తారు.
అసెంబ్లీ ఎన్నికల హడావుడి రానే వచ్చింది. ప్రచార రథాలకు నాయకులు కొత్త రంగులు వేసి ఆకర్షణీయంగా తయారు చేసుకుంటున్నారు. నెల రోజులకుపైగా అవిశ్రాంతంగా తిరగాల్సిన వాహనాల్లో మైకులు సక్రమంగా పనిచేస్తున్నాయా.. స్పీకర్లు స్పష్టంగా వినిపించేలా ఉన్నాయా లేదోనని సరి చేసుకుంటున్నారు.
జగత్సింగ్‌పూర్ జిల్లా పరదీప్‌లోని మత్స్యకారుల వలలో రెండు వందల కిలోల కోయిబోలో జాతికి చెందిన చేప చిక్కింది. ఈ భారీ మీనాన్ని కోల్‌కతాకు చెందిన ఔషధ కంపెనీ రూ. 1.27 లక్షలకు కొనుగోలు చేసింది.
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ముత్యాలరెడ్డిపల్లె కూడలిలో ఇటీవల ప్రారంభోత్సవం చేసిన దండిమార్చ్ నమూనా విగ్రహాలు ఇవి. వీటి ఏర్పాటుకు సుమారు రూ.48 లక్షలు నగరపాలిక నిధులు వెచ్చించారు.
ఆర్టీసీ బస్సులో కళాశాల విద్యార్థులు వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యలమంచిలి నుంచి పరవాడ వస్తున్న ఆర్టీసీ బస్సులో శుక్రవారం ఉదయం విద్యార్థులు ఇలా ఫుట్‌పాత్‌పై నిలబడి వేలాడుతుండగా పరవాడ వద్ద ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
రెంటచింతలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం ముందస్తు దసరా వేడుకలు నిర్వహించారు. నరకాసురవధ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు దేవతామూర్తుల వేషధారణతో సందడి చేశారు.
ఎంవీపీకాలనీలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు ఉండిపోవటంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కొద్ది సేపు సిగ్నల్స్ ఆఫ్ చేసి ముందుగా వాటికి అనుమతులు ఇచ్చారు. అయితే సాధారణ వాహనాలు సైతం ఒకేసారి కూడలి వద్దకు వచ్చే సరికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.