చిత్రం చెప్పే విశేషాలు

(15-10-2023/3)

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొలిరోజు బంగారు తిరుచ్చిపై స్వామివారు ఆలయ వీధుల్లో విహరించారు.

కోకాపేటలో సెలెస్టీ స్కిన్ లేజర్, హెయిర్ క్లినిక్‌ ప్రారంభోత్సవంలో ‘బేబీ’ చిత్ర నటులు సందడి చేశారు. హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్‌తో కలిసి నటి వైష్ణవీ చైతన్య, నటీనటులు హాజరయ్యారు.

దేశంలోనే తొలిసారిగా ఒకేరోజు 120 హర్లెయ్ డెవిడ్సన్ X 440 మోడల్ వాహనాలను నగరంలోని షోరూంలో వినియోగదారులకు అందచేశారు.

గోల్ఫ్‌ క్లబ్‌లో నవంబర్‌ 25, 26న జరగనున్న సైబర్‌ సిటీ క్యాన్సర్‌ క్రూసేడర్స్‌ గోల్ఫ్‌ ఛాంపియన్‌ షిప్‌ బ్రోచర్‌ను కృతిశెట్టి, అపోలో ఆసుపత్రి డైరెక్టర్‌ డా.పి.విజయానంద్‌ రెడ్డి విడుదల చేశారు.

హైటెక్స్‌ న్యాక్‌ గ్రౌండ్స్‌లో ‘సీఐఐ తెలంగాణ గ్రీన్‌వాక్‌ థాన్‌’ నిర్వహించారు. నగరవాసులు, నిపుణులు, ఉద్యోగులు ఉత్సాహంగా ఈ వాక్‌లో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా.. సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా కేటీఆర్‌ బీఫామ్‌ను అందుకున్నారు.

హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో సినీ నటి శ్రద్ధాదాస్‌ సందడి చేశారు. నగరంలోని ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

భారాస ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సభకు భారీఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచారరథం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఇది ప్రచారంలో భాగంగా రోడ్లపై పరుగులు పెట్టనుంది.

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home