చిత్రం చెప్పే విశేషాలు

(20-10-2023/2)

శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా జిల్లాలోని దుర్గాదేవి ఆలయాలు, దేవీపీఠాల్లో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవిని వివిధ అవతారాల్లో అలంకరించారు. వేకువజాము నుంచి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పలుచోట్ల సామూహిక కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణం, భజనలు చేశారు.

ట్రాఫిక్‌ నిబంధనలు తెలిపే డిజిటల్‌ బోర్డు ఇది. పాడవ్వడంతో మరమ్మతులకు నోచుకోక ప్యారడైజ్‌ పైవంతెన కింద వృథాగా ఉంది. 

సికింద్రాబాద్‌ భారాస అభ్యర్థి టి.పద్మారావుగౌడ్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మటన్‌ దుకాణానికి వెళ్లి.. ఇలా కట్‌ చేస్తూ శ్రేణులను ఉత్సాహపరిచారు.

సాధారణంగా కోతిని చూస్తే కోళ్లు పారిపోతుంటాయి. కోడి గుడ్లను అవి పగలగొడతాయి. పిల్లలను ఎత్తుకెళుతుంటాయి. ఇక్కడ మాత్రం కోతి, కోడిపుంజు దోస్తీ కట్టాయి. బోనకల్లు మండలం చిరునోముల గ్రామ కనకదుర్గ గుడి సమీపంలో ఓ వానరం కోడిపుంజుని దగ్గరకు తీసుకుని తన ఒడిలో పెట్టుకొని తల నిమిరింది.

ఆయా పార్టీల అభ్యర్థుల ఇంటింటి ప్రచారం మొదలైంది.. ‘కవితక్క సేన’ తరఫున ఓ కార్యకర్త ఏకంగా తన బుల్లెట్‌ వాహనాన్ని ప్రచార రథంలా మార్చేశాడు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలిసే క్రమంలో ఇలా ప్రచారం చేసుకుంటూ వెళ్తానని చెప్పుకొచ్చాడు.

పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం గ్రామంలోని కనకదుర్గ ఆలయంలో జగన్మాత గురువారం మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చి పూజలందుకున్నారు.

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నమూనా బతుకమ్మపై ఓటు ప్రాధాన్యం తెలిపే సందేశాలు ఆకట్టుకుంటున్నాయి. పలు కూడళ్లను ఇలా నమూనా బతుకమ్మలతో అలంకరించారు.

హాలియాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతుండగా.. కళ్లజోడు పడిపోతుండటం గమనించిన తనయుడు జైవీర్‌ రెడ్డి వాటిని సరిచేశారు.  

నల్గొండ జిల్లా అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మిర్యాలగూడ వైపు నుంచి నల్గొండ వైపు గాలిమరలను తరలిస్తున్న వాహనాలు మాడ్గులపల్లి మండలం కుక్కడం, మాడ్గులపల్లి, కొత్తగూడెం తదితర గ్రామాల మూలమలుపుల వద్ద నెమ్మదించాయి. అతిపెద్ద గాలిమరల పైపు కావడంతో రహదారిపై ఇబ్బందిగా ప్రయాణించాయి.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ తరఫున ఆర్ట్‌ ఫెస్టివల్‌ పోటీలు చెన్నై తిరువళ్లికేణిలోని లేడి వెలింగ్టన్‌ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో గురువారం జరిగాయి. విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చారు.

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home