చిత్రం చెప్పే విశేషాలు

(20-10-2023/2)

ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలకు వెళ్తూ మార్గమధ్యలో ఎన్‌ఏసీ బస్టాప్ వద్ద ఆగి.. రాహుల్‌ గాంధీ సరదాగా దోశలు వేశారు. అనంతరం కల్లు గీత కార్మికులతో, చిన్నారులతో ముచ్చటించారు. 

 మంగళగిరిలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ‘ఏపీ హేట్స్‌ జగన్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

సురక్షితంగా ఉండేందుకు దక్షిణ గాజాకు వెళ్లాలని ఉత్తర గాజా ప్రజలను హెచ్చరించిన ఇజ్రాయెల్‌.. అక్కడా వారిని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. హమాస్‌ మిలిటెంట్లు దాక్కున్నారంటూ పలు భవనాలపై వైమానిక దాడులు చేస్తోంది.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఉదయం హనుమంత వాహన సేవ నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. 

సీఎం జగన్‌ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 

తిరుపతిలో సినీనటి అనుపమ పరమేశ్వరన్‌ సందడి చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ వస్త్ర దుకాణం మొదటి వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తొలి ‘నమో భారత్‌’ రైలును ప్రధాని మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌-దుహై మధ్య ఈ ర్యాపిడ్‌ఎక్స్‌ రైలు పరుగులు పెట్టింది. ఇందులో ప్రధాని మోదీ ప్రయాణించారు.

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు ‌పుష్పక విమానంలో దర్శనమిచ్చారు.

చిత్రం చెప్పే విశేషాలు(11-09-2024/1)

మీతో మీరు పోటీ పడండి

చిత్రం చెప్పే విశేషాలు (10-09-2024/2)

Eenadu.net Home