చిత్రం చెప్పే విశేషాలు

(23-10-2023/1)

 తాంసి మండలం ఈదుల్లాసావర్గాంకు చెందిన రాగన్న తన పెంపుడు శునకాన్ని అచ్చం పులిలా మార్చారు. పులి మాదిరిగానే రంగువేశారు. భిక్షాటన చేసే ఈయన మండలంలోని ఆయా గ్రామాల్లో తిరుగుతూ జీవనం సాగిస్తున్నారు. అడవి జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు శునకాన్ని పులిలా మార్చినట్లు ఆయన చెబుతున్నారు.

జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

అనంతపురం జిల్లా కేంద్రం పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు. ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

మరా క్రియేషన్స్ అండ్‌ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ కలిసి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అయోధ్యనగరంలో ఒక ముఖ్య ప్రదేశంలో ప్రతిష్ఠించనున్న 7.5 అడుగుల బాలరాముడి విగ్రహం. రథయాత్రలో భాగంగా శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి తీసుకువచ్చారు.

ఏ వాడలో తిరిగినా ‘పూల’పుంతలు తళుక్కుమన్నాయి. ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకను ఉభయ జిల్లాల్లో ఘనంగా జరుపుకొన్నారు. రోజుకొక రూపంలో.. తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మల వద్ద మహిళలు ఆడిపాడారు. చివరి రోజు నిమజ్జన వేడుకలు కనులపండువగా జరిగాయి. బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరింది.

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారు 9వ రోజు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 

దసరా మహోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ దేవి ఆలయంలో కుమారి పూజలు నిర్వహించారు.

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

Eenadu.net Home