చిత్రం చెప్పే విశేషాలు

(28-10-2023/3)

ప్రముఖ నటుడు అర్జున్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య.. కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి వివాహం చేసుకోనున్నారు. శుక్రవారం వీరి నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది.

హీరో పవన్‌ కల్యాణ్‌ కుటుంబసమేతంగా ఇటలీకి బయల్దేరారు. హీరో వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్‌ 1న ఇటలీలో జరగనుంది. ఈ పెళ్లి కోసమే పవన్‌ ఇటలీ వెళ్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌లో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న బైక్‌ నడుపుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

గాజాలో ఇజ్రాయెల్‌ భారీగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు క్షతగాత్రులయ్యారు. గాజాలోని పలు భవనాలు నేల కూలాయి.

 హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్ నిర్వహించారు. నవంబర్‌ 7, 8, 9 తేదీల్లో ఈ ఎగ్జిబిషన్‌ జరగనుంది.ఈ సందర్భంగా పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పలువురు మోడల్స్‌ హాజరయ్యారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ శ‌నివారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం యాదాద్రి ఆలయాన్ని మూసివేశారు. దీంతో ఆలయ మాడ వీధులు నిర్మానుష్యంగా మరాయి. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో శనివారం భారాస ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. మంత్రి హరీశ్‌ హాజరై ప్రభుత్వ పథకాల గురించి ప్రసంగించారు.

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

Eenadu.net Home