చిత్రం చెప్పే విశేషాలు (03-11-2023/2)

విశాఖలో సినీనటి శ్రీలీల సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు డిజైన్లతో ఆభరణాలను ఆమె ఆవిష్కరించారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

అల్లూరి జిల్లా పాడేరు మండలం వంజంగి కొండల్లో మంచు సోయగం అబ్బురపరుస్తోంది. వంజంగి కొండలు సూర్య కిరణాల ప్రతిబింబంతో పర్యాటకులను మరింత ఆకట్టుకుంటున్నాయి.

హనుమకొండలోని శ్రీ హనుమధ్గిరి పద్మాక్షి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘ఓటరుగా గర్విస్తున్నా’ అనే నినాదంతో రూపొందించిన స్టిక్కర్లను రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో రూపొందించారు. ఎల్బీనగర్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో ఇళ్లకు గురువారం వాటిని అతికించి.. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 

ఇప్పటి వరకు పార్టీలు ఎవరి గుర్తు వారు ఉపయోగించి ప్రచారం నిర్వహించగా కాంగ్రెస్‌ పార్టీ కొత్త తరహా ప్రచారానికి సన్నాహాలు చేస్తోంది. పాత కార్లపై భారాస పార్టీ రంగులు, కేసీఆర్‌ చిత్రాలు ఉపయోగించి ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతూ  ప్రచారానికి ఏర్పాట్లు చేస్తోంది. 

నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా  జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఫ్లెక్సీలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

 హైదరాబాద్‌ గాంధీనగర్‌ డివిజన్‌లో  ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు.

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home