చిత్రం చెప్పే విశేషాలు

(03-11-2023/3)

తిరుమల శ్రీవారిని టీమ్‌ఇండియా క్రికెటర్లు రిషభ్‌ పంత్, అక్షర్ పటేల్ దర్శించుకున్నారు. టీమ్‌ఇండియా.. ఈసారి వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

 ప్రధాని నరేంద్ర మోదీని త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీకి జ్ఞాపికను అందజేశారు.

 ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకరపోరు సాగుతోంది. దీంతో గాజాలో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా,  మరికొందరు గాయపడ్డారు.

కిషన్‌ రెడ్డి భాజపా ఎన్నికల ప్రచారాన్ని కామారెడ్డిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభివాదం చేశారు.  

ఒంగోలులోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీనటి శ్రీముఖి సందడి చేశారు. ఆమెను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.

 రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో.. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, భాజపా గజ్వేల్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. 

శ్రీవారి దర్శనార్థం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమలకు చేరుకున్నారు. వారికి తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

మెరికన్‌ సూపర్‌ హీరో సినిమా ‘ది మార్వెల్స్‌’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్‌ ఈవెంట్‌లో సినీ నటి సమంత సందడి చేశారు.

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

Eenadu.net Home