చిత్రం చెప్పే విశేషాలు

(05-11-2023/3)

నేపాల్‌ను భూకంపం మరోసారి కుదిపేసింది. ఆదివారం తెల్లవారుజామున కాఠ్‌మాండూకు వాయువ్య దిశలో భూకంపం సంభవించింది.

హీరోయిన్‌ అమలా పాల్‌ వివాహం ఆదివారం కేరళలోని కొచ్చిలో వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, పర్యాటక, ఆతిథ్య రంగాల నిపుణుడు జగత్‌ దేశాయ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గఢ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బమ్లేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రి కేటీఆర్‌ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి చెందిన ‘మైవిలేజ్‌షో’ బృందం సభ్యులతో కలిసి ఇటీవల హైదరాబాద్‌ శివారులో నాటుకోడి కూర వండి భోజనం చేశారు. 

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు పుట్టిన రోజు వేడుకను హైదరబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో ఎంపీ రఘురామకృష్ణరాజు, బాలకృష్ణ కలిసి ఇలా ముచ్చటించారు. 

తిరుమల శ్రీవారిని సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ దర్శించుకున్నారు. పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్‌కతాలో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీ చేసి సచిన్‌ రికార్డును సమం చేశాడు. ఈరోజు కోహ్లీ పుట్టిన రోజు కావడం విశేషం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస వివిధ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగూడెం, సింగరేణిలో నిర్వహించిన సభలకు సీఎం కేసీఆర్‌ హాజరై ప్రసంగించారు.

చిత్రం చెప్పే విశేషాలు (14-10-2024)

స్ఫూర్తినింపే ఆసక్తికర విషయాలు

ప్రపంచంలో కొనసాగుతున్న యుద్ధాలు!

Eenadu.net Home