చిత్రం చెప్పే విశేషాలు
(08-11-2023/1)
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బేగంపేట డివిజన్‌లో పర్యటించిన కూకట్‌పల్లి భారాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు ఓ అభిమాని బొమ్మలు వేసిన విస్తరాకులను అందించారు.
సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఆ వ్యోమనౌకలోని ‘హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్’ (హెచ్‌ఈఎల్1ఓఎస్) ఈ ఘనత సాధించింది.
దీపావళి పండగ సందర్భంగా గుజరాత్‌లోని సురత్‌లో 3,500 చదరపు అడుగుల అయోధ్య మందిర రంగోళిని అగర్వాల్ వికాస ట్రస్ట్ యూత్ సభ్యులు వేశారు. 50 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పుతో సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు.
దిల్లీకి చెందిన సయ్యద్ నూర్ అలామ్ తన మైనర్ కుమార్తె కోసం.. తన స్నేహితుడి దగ్గర ఉన్న ఓ పాత స్కూటీని తీసుకున్నాడు. ఎనిమిది నెలల పాటు శ్రమించి, రూ.70 వేలు వెచ్చించి మినీ బుల్లెట్‌ను తయారు చేశాడు. దానికి ముద్దుగా పింక్ బుల్లెట్ అని పేరు పెట్టాడు.
మొహమ్మద్ అబు నామూస్ అనే వైద్యుడు ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాయపడిన క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు గాజాలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. తన భార్య, కుమార్తెలను అతి కష్టం మీద ఒప్పించి రఫా సరిహద్దు నుంచి సురక్షిత ప్రాంతానికి పంపించారు.
పర్లాఖెముండి పట్టణంలోని మహారాజా బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిశు మహోత్సవం 2023 (సురభి) కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల పప్పు దినుసులు, బియ్యం, ఇతర పదార్థాలతో రూపొందించిన చంద్రయాన్-3 నమూనా అందరినీ ఆకట్టుకుంది.
బేగంపేట నుంచి ఎల్.బి.స్టేడియానికి వెళ్తున్న మోదీ కాన్వాయ్ సచివాలయ బస్టాప్ సమీపంలోకి రాగానే అక్కడ ఉన్న జనం ప్రధానిని తమ చరవాణుల్లో క్లిక్‌మనిపిస్తూ కనిపించారు.
అయ్యో.. ఇంటి ముందు నిలువునా ఎండిపోయిందే అని ఆ మోడును వారు తొలగించలేదు. రంగులు వేసి.. వాటిపై కళాత్మకంగా బొమ్మలు అద్ది.. ఆ ఇంటికే అందాన్ని తీసుకొచ్చారు. దిల్‌సుఖ్‌నగర్ శారదా నగర్‌లో కనిపించిన దృశ్యం ఇది.
విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూడీ మైదానంలో సుమారు రూ.400 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దుతున్నారు.. స్మృతివనం పనులు తుదిదశకు చేరడంతో.. పార్కులో పచ్చదనం పెంచే పనులు వేగం పుంజుకున్నాయి.
నానాల్‌నగర్ ఖాదర్‌బాగ్‌లో కార్వాన్ ఎంఐఎం అభ్యర్థి, ఎమ్మెల్యే కౌసర్ మొహియిద్దీన్‌కు స్థానిక కార్యకర్తలు కండ చక్కెరతో తులాభారం వేసిన దృశ్యం .
కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్‌లో ప్రచారంలో ఓ టిఫిన్ సెంటర్ వద్ద భారాస అభ్యర్థి లాస్య నందిత దోసెలు వేశారు.