చిత్రం చెప్పే విశేషాలు

(11-11-2023/2)

 ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య పోరుతో గాజాలోని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాజాపై ఇజ్రాయెల్‌ వరుస దాడులు చేస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు మృతి చెందారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు.

మలయాళీ నటుడు జయరాం కుమారుడు, యువ నటుడు కాళిదాస్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన స్నేహితురాలు తరిణీ కళింగరాయర్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు. శుక్రవారం వీరి నిశ్చితార్థం చెన్నైలో వేడుకగా జరిగింది.

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ చోట ఆయన దుస్తులు ఇస్త్రీ చేశారు.

 కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది. మందుబాటిళ్ల కోసం మందుబాబులు ఒక్కసారిగా ఎగబడ్డారు.

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం సిద్ధమైంది. ఇందులో భాగంగా సరయూ తీరంలోని 51 ఘాట్‌లలో ఒకేసారి 24లక్షల దీపాలను వెలిగించనున్నారు.

పెళ్లికి వినూత్నంగా శుభలేఖలు అచ్చు వేయించడం ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి పెళ్లి పత్రికను ప్రశ్న, జవాబు మాదిరిగా అచ్చు వేయించి బంధువులను ఆశ్చర్యానికి గురిచేశారు. 

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు(05-12-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు.. (05-12-2023/1)

Eenadu.net Home