చిత్రం చెప్పే విశేషాలు

(12-11-2023/1)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ నదీ తీరాన గత ఏడేళ్లుగా దీపావళికి ముందు రోజు దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈసారి దీపోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది. శనివారం సాయంత్రం సరయూ తీరంలోని 51 ఘాట్‌లలో 22లక్షలకు పైగా దీపాలను అందంగా తీర్చిదిద్దారు. 

 అమెరికాలోని హవాయిలో ఓ చెరువు నీరు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత రెండు వారాలుగా ఈ నీరు ఇలాగే కనిపిస్తోంది. అధిక లవణీయత ఉన్న నీటిలో కనిపించే బాక్టీరియా కారణంగా నీళ్లు రంగు మారిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

దీపావళి సందర్భంగా గుజరాత్‌లోని ఓ స్వీట్ల దుకాణం.. 24 క్యారెట్ల బంగారు పూతతో మిఠాయిలను తయారు చేసింది. వీటి ధర కిలో రూ.12వేలుగా నిర్ణయించింది. రాజ్‌కోట్‌ జిల్లా ధోరాజీలోని గౌతమ్‌ స్వీట్స్‌ దుకాణం ఈ మిఠాయిలను అందుబాటులోకి తెచ్చింది.

స్టార్‌ హీరో ప్రభాస్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సలార్‌ పార్ట్‌1 సీజ్‌ ఫైర్‌’. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన పట్నాయక్‌ ఆదివారం దీపావళి పురస్కరించుకుని శనివారం సాయంత్రం గోపాలపూర్‌ సముద్ర తీరంలో సైకత శిల్పాలు వేశారు. చూపరులను రెండు సైకత శిల్పాలు ఆకట్టుకున్నాయి. 

పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, అజయ్‌, సురేష్‌ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. 

ఒడిశాలోని పర్లాఖెముండిలోని శిశు విద్యా మందిర్‌ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు  జై శ్రీరామ్‌ అని రాసి దీపాలు అలంకరించారు. 

దీపావళి సందర్భంగా అసెంబ్లీ చౌరస్తా నుంచి మోజంజాహి మార్కెట్‌ వరకు శనివారం రెండు గంటల పాటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. రద్దీలో ఇరుక్కున్న ట్రాఫిక్‌ పోలీసులు ముందకు కదల్లేక.. వెనక్కి వెళ్లలేక క్రేన్‌లోని ద్విచక్ర వాహనంపై నిద్రించగా కెమెరా క్లిక్‌మనిపించింది.  

పార్వతీపురం జిల్లాలో కురుపాం పరిధిలో 17 వేల ఎకరాలకు సాగు నీరందించే వట్టిగెడ్డ జలాశయమిది. ఎగువన వర్షాలు లేకపోవడంతో పూర్తిస్థాయిలో నీరు లేక క్రీడా మైదానంలా మారింది.

చిత్రం చెప్పేవిశేషాలు(26-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ చెప్పిన సూక్తులు (శతజయంతి)

Eenadu.net Home