చిత్రం చెప్పే విశేషాలు

(13-11-2023/1)

దీపావళి పర్వదినాన దేశమంతా దీపాల వెలుగులో ధగధగలాడిపోయింది. దిల్లీకి చెందిన రోబోటిక్స్‌ కంపెనీ ఆరెంజ్‌వుడ్ సంస్థ రొటీన్‌కు భిన్నంగా ఈ దీపావళి పూజను నిర్వహించింది. మనుషులు మాదిరిగానే దేవుడి ముందు నిల్చొని రోబోలు గంట కొడుతూ, హారతి ఇచ్చాయి.

 దీపావళి పండగ అంటే గుర్తొచ్చేది టపాసులు, మిఠాయిలే. దీంతో వినియోదారులను ఆకర్షించేందుకు దుకాణదారులు వివిధ వెరైటీల స్వీట్స్‌ను అందుబాటులో ఉంచారు. 24 క్యారెట్ల బంగారం పూతతో గోల్డ్‌ స్వీట్‌ను తయారు చేయటం విజయవాడలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

యూకే పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతులకు ప్రధాని మోదీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి విగ్రహం, భారత్‌స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను రిషి సునాక్‌కు అందించారు. 

టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున , వెంకటేశ్‌ ఒక్క చోట చేరారు. సంబంధిత ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఓకే ఫ్రేమ్‌లో ఈ ముగ్గురు కనిపించడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం చిరంజీవి ఇంట్లో దిగిన ఈ ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి.

 కన్నడ ప్రముఖ హీరో ఉపేంద్ర సతీమణి, నటి ప్రియాంక ‘క్యాప్చర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రియాంక పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ విడుదల చేసింది. 

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ‘కోలియా భోమోర వంతెన’ ఫొటోలను ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.  ‘సో బ్యూటిఫుల్‌.. సో ఎలిగెంట్‌.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌’’ అంటూ హిమంత ట్వీట్‌ చేశారు.

జూ.ఎన్టీఆర్‌, వరుణ్‌తేజ్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

కుటుంబసభ్యులతో కలిసి యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్‌ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 

 దీపావళి పండగను పురస్కరించుకుని దిల్లీ వాసులు బాణసంచా పేల్చారు. కాలుష్య పరిస్థితుల దృష్ట్యా దిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు పూర్తి నిషేధం విధించినప్పటికీ.. చాలా చోట్ల అర్ధరాత్రి వరకు బాణసంచా మోత మోగింది. దీంతో సోమవారం ఉదయానికి దిల్లీలో గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home