చిత్రం చెప్పే విశేషాలు
(17-11-2023/1)
నాగులచవితి పూజలకు సాలూరు మండలం శివరాంపురంలోని నాగదేవత ఆలయం ముస్తాబైంది. చవితి రోజున ఇక్కడ పెద్దఎత్తున పూజలు జరగనున్నాయి.
నర్సిపురం మండలంలోని అయ్యప్ప ఆలయంలోనూ ఈ పూజ వేడుకగా నిర్వహిస్తారు. గురువారం మెట్లపై కలశాలను పూలతో అలంకరించారు. అర్చకులు పవన్‌శర్మ, విజయ్‌శర్మ ఆధ్వర్యంలో పూజలు చేశారు.
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఆర్జిత కల్యాణాన్ని వేడుకగా జరిపారు.అనంతరం ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం మేరకు పుణ్యాహ వచనం, విశ్వక్షేణ ఆరాధన, కలశారాధన, నవగ్రహ ఆరాధన వంటి పూజలతో కల్యాణం నిర్వహించారు.
బోగోలు మండలం జువ్వలదిన్నె చేపల రేవులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా.. 20 బోట్లు చేపల రేవు వద్దకు చేరుకున్నాయి. అలజడి తగ్గడంతో.. గురువారం తిరిగి సముద్రం వైపు పయనమయ్యాయి.
ఆంధ్రాఊటీ అరకులోయలోని అటవీశాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం సందర్శకులను అలరిస్తోంది. ఫొటోషూట్ కోసం ఏర్పాటు చేసిన పలు ఆకృతులు, చిన్నారుల పార్కు, ఉద్యాన నర్సరీ తదితరాలు అలరిస్తున్నాయి.
మెదక్‌లో ఓటరు నమోదు, ఎథిక్ ఓటింగ్, సీ విజల్ తదితర వాటిపై రంగోలి పోటీలు నిర్వహించారు. అనంతరం యువత, మహిళలతో నేను ఓటేస్తా అంటూ ప్రతిజ్ఞ చేయించారు.
భారత నౌకాదళం ఆధ్వర్యంలో చేపట్టిన గల్ఫ్ ఆఫ్ గినియా (జీఓజీ) యాంటీ పైరసీ గస్తీ ముగిసిందని గురువారం నేవీ వర్గాలు తెలిపాయి. ఈ విధుల్లో నైజీరియా, అంగోలా, నమీబియా తదితర దేశాలు గస్తీలో భాగస్వామ్యం అయినట్టు వెల్లడించాయి.
హ్యామ్స్ టెక్ ఫ్యాషన్ కళాశాల విద్యార్థులు ఆటపాటలతో అదరహో అనిపించారు. సినిమా పాటలకు అదిరే స్టెప్పులేయడమే కాక.. సరికొత్త డిజైన్ దుస్తులు ధరించి ర్యాంప్‌వాక్‌తో చూపరులను ఆకట్టుకున్నారు.