చిత్రం చెప్పే విశేషాలు
(18-11-2023/2)
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల కెప్టెన్‌లు రోహిత్ శర్మ, కమిన్స్ వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటోలు దిగారు.
తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం ‘మాధవే మధుసూధన’. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఆర్ మాధవన్, కంగనా రనౌత్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌లో కలసి నటించనున్నారు. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమంతో మొదలైంది. అయితే ఈ సెట్స్‌పైకీ సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చి కంగనాను సర్‌ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని కంగనా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిలో భాగంగా భాజపా ఆధ్వర్యంలో గద్వాలలో సకల జనుల సంకల్ప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు భారత వాయుసేన ఆధ్వర్యంలోని సూర్యకిరణ్ ఎయిరోబాటిక్ బృందం విన్యాసాలు చేయనుంది. దీంతో శుక్రవారం నరేంద్ర మోదీ స్టేడియంలో సాధన చేసింది.
ఇండియన్ పోలీస్ సర్వీస్ 75 ఆర్‌ఆర్‌కి చెందిన ప్రొబేషనర్లు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు బలగాలు ఎనలేని కృషి చేశాయని రాష్ట్రపతి అన్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. భరత్‌పుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. సభకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీతీర్థం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.