చిత్రం చెప్పే విశేషాలు
(19-11-2023/1)
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మద్య క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరు జరగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ శిల్పి సుదర్నన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది.
వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ విజేతగా నిలవాలని ఆశిస్తూ ప్రభాస్ ‘సలార్’ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా పోస్టర్ పెట్టింది.
ఒడిశాలోని పూరీ తీరంలో ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకతశిల్పం రూపొందించారు. దీనిపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని, కోల్‌కతాలోని జర్మన్ కాన్సులేట్ జనరల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్తికమాస శనివారం సందర్భంగా ఏలూరులోని కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ, ఊయల సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు దీపాలు వెలిగించి స్వామివార్ల ఆశీస్సులు పొందారు.
భారత్- ఆస్ట్రేలియా ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ను ప్రజలు వీక్షించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని మాజేటి గురవయ్య పాఠశాల ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ ఉప్పల్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శనివారం కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఆకులో ఆకులా కలిసిపోయి చూసేవారిని ఆశ్చర్యచకితులను చేస్తోంది ఈ మిడత. ప్రకాశం జిల్లాలోని కనిగిరికి చెందిన కేతినేని రాములమ్మ అనే విశ్రాంత ఉద్యోగిని ఇంటి ఆవరణలో ఈ దృశ్యం కనిపించింది.
మంచు అందాలతో సలమరంగి గ్రామంలోని కొండలు కనువిందు చేస్తున్నాయి. భీరం పంచాయతీ సలమరంగిలో ఎత్తయిన కొండల్లో శనివారం ఉదయం భారీగా మంచు అలముకుంది. ఇవి వంజంగి కొండల్లా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి.
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మద్య క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరు జరగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ శిల్పి సుదర్నన్ పట్నాయక్ రూపొందించిన 56 అడుగుల పొడవైన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరగనున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో భారత్ విజయం సాధించాలని అనకాపల్లికి చెందిన వీరాభిమాని శ్రీనివాసరావు వినూత్నంగా తలపై ఇరుదేశాల పేర్లను, ట్రోఫీని పెయింటింగ్ చేసుకొని ఆకర్షించాడు.