చిత్రం చెప్పే విశేషాలు
(19-11-2023/2)
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన ఎయిర్ షో విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ విన్యాసాలను అభిమానులు ఆసక్తిగా వీక్షించారు.
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా దిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు.
ప్రపంచకప్ ఫైనల్‌లో అహ్మదాబాద్ వేదికగా భారత్ × ఆస్ట్రేలియాలు తలపడుతున్నాయి. మ్యాచ్‌కు ముందు ట్రోఫీని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ మైదానంలోకి తీసుకొచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ విజయభేరి సభలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరై ప్రసంగించారు.
ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. దీంతో పెద్ద ఎత్తున వచ్చిన క్రికెట్ అభిమానులతో స్టేడియం నీలి సముద్రంలా మారింది.
ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆయన నివాసంలో మ్యాచ్ చూస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
పంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు ఆయా స్క్రీన్ల వద్దకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.