చిత్రం చెప్పే విశేషాలు
(20-11-2023/2)
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ఆలయం ఎదుట కార్తిక దీపారాధన చేశారు.
విశాఖపట్నం నగరంలోని ఫిషింగ్ హార్బర్‌లో చెలరేగిన మంటలకు 40కి పైగా బోట్లు దహనమైన విషయం తెలిసిందే. బాధితులకు న్యాయం చేయాలంటూ మత్స్యకార నాయకులు నిరసన చేపట్టారు. ఫిషింగ్ హార్బర్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తికమాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానమాచరించి, కార్తిక దీపారాధన చేశారు.
ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోత్‌బీ లండన్‌లో నిర్వహించిన వేలంలో మెకలాన్ కంపెనీ తయారు చేసిన 97 ఏళ్ల నాటి సింగిల్ మాల్ట్ విస్కీ రూ.22 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. మెకలాన్ కంపెనీ 1926లో ఈ విస్కీని తయారు చేసి.. 60 ఏళ్లు నిలవ చేసింది.
పర్యావరణానికి ప్రమాదకారిగా నిలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, సాగర జలాల పరిరక్షణ మానవాళి రక్షణ ధ్యేయం కావాలన్న సందేశంతో ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆదివారం పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు. ఇది పలువురిని ఆకట్టుకుంది.
శతశాతం పోలింగే లక్ష్యంగా అధికార యంత్రాంగం స్వీప్ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ అన్న నినాదంతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు.
క్రికెట్ ప్రపంచకప్‌లో విజేత జట్టుకు అందించే ట్రోఫీ నమూనాను పెన్సిల్ ముల్లుపై చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ అద్భుతంగా తీర్చిదిద్దారు. నాలుగు మిల్లీమీటర్ల వెడల్పు, ఎనిమిది మిల్లీ మీటర్ల ఎత్తుతో కప్ తయారీకి నాలుగు గంటల సమయం పట్టింది.
ఇది జాతీయ రహదారిలో వెళ్తున్న లారీ. భోగాపురం మండలంలో సుందరపేట వద్ద కనిపించిన ఇలాంటి పరిస్థితులపై అధికారులు కూడా దృష్టిసారించాల్సి అవసరం ఉంది.