చిత్రం చెప్పే విశేషాలు
(20-11-2023/2)
వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఆరోసారి కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మిచెల్ మార్ష్ ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన ఫొటో ఒకటి నెట్టింట హల్‌చల్‌గా మారింది. దీంతో అభిమానులు ప్రపంచ కప్‌కు కనీసం గౌరవం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచకప్ టోర్నీలో తొలి నుంచి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న టీమ్‌ఇండియా చివరి మెట్టుపై బోల్తాకొట్టింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు టీమ్‌ఇండియాకు అండగా నిలుస్తున్నారు. విరాట్ సతీమణి అనుష్క శర్మ మ్యాచ్ అనంతరం విరాట్‌ను ఓదార్చారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రాజస్థాన్ పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ.. ఏడు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టారు.
వన్డే ప్రపంచ కప్ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో మన జట్టును ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. ఆటగాళ్లను ఓదార్చారు.
కార్తికశోభతో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు కిటకిటలాడాయి. రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం వేములవాడ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయెల్ భారీగా దాడులు చేస్తూనే ఉంది. దీంతో కొందరు ప్రాణాలు వదలగా.. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. ఆ ప్రాంతంలోని పాలస్తీనీయులు కూడా భారీగా వలస బాటపట్టారు.
అశోక్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులు మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి వారితో కాసేపు ముచ్చటించి, ఎన్నికల తర్వాత వారితో చర్చిస్తానని తెలిపారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోని కులియానాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు విద్య కీలకమని రాష్ట్రపతి అన్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో తొలి కార్తీక సోమవారం సందర్భంగా జ్యోతిర్లింగార్చనను వైభవంగా జరిపారు. దీపాలతో ఏర్పాటు చేసిన ఆకృతులు ఆకట్టుకున్నాయి.