చిత్రం చెప్పే విశేషాలు

(04-12-2023/2)

 మిగ్‌జాం తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. స్వర్ణముఖి నదిలోకి భారీగా వరద చేరుతోంది. వాకాడులో స్వర్ణముఖి బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తారు. 

మిగ్‌జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బాసిన్‌ బ్రిడ్జ్‌, వ్యాసర్‌పాడి మధ్యలోని బ్రిడ్జ్‌ నెం:14ను మూసివేసినట్లు ప్రకటించారు. ఈ ప్రాంతంలో చాలా ప్రదేశాలు జలమయమయ్యాయి.

సినీ నటుడు నాని హీరోగా నటించిన ‘హాయ్‌ నాన్న’ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. 

స్టార్‌ హీరో రామ్ చరణ్‌ మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లో మంచు కురుస్తోంది. దీంతో రహదారులపైకి మంచు భారీగా పేరుకుపోయింది. 

ఇండోనేషియా లోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఆదివారం సుమత్రా దీవిలో మౌంట్‌ మరపిలో ఉన్న ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది. 

 ఇజ్రాయెల్‌.. గాజాలోని జబాలియా ప్రాంతంపై దాడులకు పాల్పడింది. దీంతో పాలస్తీనాకు చెందిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. 

బాపట్ల జిల్లా వేమూరు మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలు, వరి పొలాలను మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. 

చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home