చిత్రం చెప్పే విశేషాలు

(04-12-2023/3)

ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఆదివారం సుమత్రా దీవిలో మౌంట్‌ మరపిలో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది.

నాగార్జున నటిస్తోన్న చిత్రం ‘నా సామి రంగ’ . విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. హీరోయిన్‌ పాత్రను పరిచయం చేస్తూ తాజాగా ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదలైంది. వరలక్ష్మిగా ఆషికా లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

రాష్ట్రపతి భవన్‌లో భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఆర్. వెంకటరామన్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో తుపాను ప్రభావంతో తిరుమల ఘాట్‌రోడ్డులో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. వర్షం కారణంగా జలపాతాలు ఎగసిపడుతున్నాయి.

మిగ్‌జాం తుపాను ప్రభావంతో చెన్నైలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు.

 మిగ్‌జాం తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో వర్ష తీవ్రత పెరుగుతూనే ఉంది. బాపట్ల సహా పలు తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

మిగ్‌చాం తుపాను కారణంగా కొత్తపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సుమారు 20 మీటర్లు ముందుకు వచ్చింది. దీంతో మత్సకారులు బోట్లు అన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. 

 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు అనంతరం భారాస ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన భారాస ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. 

చిత్రం చెప్పే విశేషాలు(27-07-2024)

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

Eenadu.net Home