చిత్రం చెప్పే విశేషాలు

(05-12-2023/1)

 రాష్ట్రపతి భవన్‌లో కెన్యా అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు. ఈ మేరకు మూడు రోజులపాటు భారత్‌లో కెన్యా అధ్యక్షుడి పర్యటన సాగనుంది.

మిగ్‌జాం తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం నుంచి వర్షాలు మొదలయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

తీవ్ర తుపాను మిగ్‌జాం బాపట్ల సమీపంలో తీరం దాటింది. దీంతో తీరం వెంబడి గంటకు 90-100కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయ‌ని, దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్న‌ట్లు తితిదే ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు. 

జనగామ భారాస అధ్యక్షుడు పాగాల సంపత్‌ రెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి కేటీఆర్ పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇండోనేసియాలోని మౌంట్‌ మరపి అగ్ని పర్వతం సోమవారం బద్దలైంది. దీంతో మూడు వేల మీటర్ల ఎత్తు వరకు బూడిద వ్యాపించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

 హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను తెలియజేస్తూ చిత్రం బృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.

చెన్నైలో తాను నివాసం ఉండే ప్రాంతం నీట మునిగిందని, సాయం కోసం ఎదురుచూస్తున్నానని తమిళ హీరో విష్ణు విశాల్‌ సోషల్‌ మీడియాలో వేదికగా పోస్ట్‌ పెట్టారు. సంబంధిత ఫొటోలు షేర్‌ చేశారు. తనతో పాటు చాలామంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(09-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

Eenadu.net Home