చిత్రం చెప్పే విశేషాలు

(05-12-2023/2)

సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘మంగళవారం’ చిత్ర బృందం ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

హైదరాబాద్‌లో లకోటియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో ఎవాల్వ్ పేరుతో కిడ్స్‌ ఫ్యాషన్ షో నిర్వహించారు. చిన్నారులు ర్యాంప్‌ వాక్‌ చేసి అలరించారు.

తాను నివాసం ఉండే ప్రాంతం నీట మునిగిందని, సాయం కోసం ఎదురుచూస్తున్నానని తమిళ హీరో విష్ణు విశాల్‌ పెట్టిన పోస్టుకు వెంటనే ఫైర్‌, రెస్క్యూ విభాగాలు స్పందించాయి. రెస్క్యూ టీమ్‌తో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ కనిపించారు. 

ప్రముఖ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను నెట్టింట షేర్‌ చేశారు. 

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు డిసెంబర్‌ 7న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌ జాం తుపాను కారణంగా ఆదిలాబాద్‌లో మంగళవారం చల్లటి వాతావరణం నెలకొంది. ఉదయం 10 గంటల వరకు మంచు కురిసింది. 

మిగ్‌ జాం తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంట పొలాలు మొత్తం జలమయమయ్యాయి. చేతికొచ్చిన పంటలు నీటమునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 

మిగ్‌ జాం తుపాను ధాటికి బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో పోలీస్ అవుట్ పోస్ట్ కూలడానికి సిద్ధంగా ఉంది. 

చిత్రం చెప్పేవిశేషాలు(09-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

Eenadu.net Home