చిత్రం చెప్పే విశేషాలు
(16-12-2023/2)
వైకుంఠ అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రాజ శ్రీ లక్ష్మీ నరసింహదాసు 233వ జయంతి ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహదాసు చిత్ర పటానికి ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
చోడవరం పట్టణంలో స్వయంభూ గౌరశ్వరాలయం ప్రాంగణంలో శుక్రవారం రాత్రి 41 వేల ప్రమిదలతో దీపోత్సవం వైభవంగా జరిగింది. శివలింగాకారంలో భక్తులు దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో బ్రైడల్ ఫ్యాషన్ షో జరిగింది. పలువురు డిజైనర్లు రూపొందించిన బ్రైడల్ డిజైనర్ వస్త్రాల్లో మోడళ్లు ర్యాంప్‌పై మెరిశారు.
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శనివారం మెట్లోత్సవం వైభవంగా జరిగింది. అంతకుముంద స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కొండ దిగువన తొలి పావంచాల వద్ద స్వామి, అమ్మవార్లకు పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో 224వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా అరబుపాలెంలో బీసీల నాయకులు, అనకాపల్లిలోని బెల్లం తయారీదారులు, గంగాదేవిపేటలో రైతులతో లోకేశ్ సమావేశమయ్యారు.
చైనా రాజధాని బీజింగ్‌లో భారీ మంచు కురుస్తోంది. బీజింగ్ పశ్చిమాన పర్వత ప్రాంతంలోని సబ్వే ఉపరితల చాంగ్‌పింగ్ లైన్‌లో రైల్వే ట్రాక్‌లపై మంచు పేరుకుపోయింది. కురుస్తున్న మంచు కారణంగా బీజింగ్‌లో పాఠశాలల్ని మూసేశారు. రహదారులపై పడిన మంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
అయోధ్యకు 25 కి.మీ.ల దూరంలోని ధన్నీపుర్‌లో దేశంలోనే అతిపెద్ద మసీదును నిర్మించనున్నారు. తాజ్‌మహల్ కంటే అందంగా ఉండేలా ఈ మసీదును సిద్ధం చేయనున్నట్లు మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ముంబయికి చెందిన భాజపా నేత హాజీ అరాఫత్ షేక్ తెలిపారు.
ఈ నెల 17న ప్రధాని మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెటును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి వినూత్నంగా స్వాగతం పలికేందుకు సూరత్‌లోని 24 వేలమంది విద్యార్థులు స్థానిక పోలీసు మైదానం నుంచి15 కిలోమీటర్ల మేర విద్యార్థులతో మానవహారం ఏర్పాటుచేశారు.