చిత్రం చెప్పే విశేషాలు
(05-01-2024/3)
ఈరోజు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రవేశ ద్వారం హనుమాన్, గరుడ విగ్రహాలను ప్రతిష్టించారు. లేత గులాబి రంగు ఇసుకరాయితో తయారు చేసిన ఈ విగ్రహాలను రాజస్థాన్‌లోని బన్సి పహర్‌పూర్ గ్రామం నుంచి తీసుకువచ్చారు.
‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా విశాఖలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు.
రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఈగల్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. సంక్రాంతి రేసు నుంచి ఈ చిత్రం వైదొలిగింది. ఈ నేపథ్యంలోనే ‘ఈగల్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం శుక్రవారం ఓ పోస్ట్ పెట్టింది.
వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. బాధ్యతలు అప్పగించే విషయంపై ఆయనతో చర్చించారు.
నాగ్ అశ్విన్ - ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. శుక్రవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ద్వారా చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది.
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ, పెగాసిస్టమ్స్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జాఫర్‌గూడలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ఈవెంట్‌కు సినీనటి మంచు లక్ష్మి హాజరై చిన్నారులతో కలిసి సందడి చేశారు.
మోహన్‌బాబు మనవడు.. విష్ణు కుమారుడు అవ్రామ్ మంచు ‘కన్నప్ప’ చిత్రంతో తెరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని ‘కన్నప్ప’ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
కనిగిరిలో ‘రా.. కదలిరా’ పేరుతో చంద్రబాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ‘రా.. కదలిరా’ పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు
‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో సునీల్ ‘కిల్లర్ నాని’ అనే పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది.