చిత్రం చెప్పే విశేషాలు

(06-01-2024/2)

కాలిఫోర్నియా బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీహిల్టన్‌ హోటల్‌లో గత నెలలో 81వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ఎంపికకు నామినేషన్స్‌ జరిగాయి. జనవరి 7వ తేదీన ఎంపికైన నటీనటులకు ఈ అవార్డును అందించనున్నారు. 

క్రికెట్‌ దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘లాల్‌ సలాం’ చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి అని పేర్కొంది.

 ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనిగిరి పార్టీ కార్యాలయం పక్కన ఏడాదిగా ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు.

జమ్మూలో కురిసే మంచు అందాలు మరింతగా ఆకట్టుకుంటాయి. ఈ మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు విదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితీవ్రత మరింతగా పెరుగుతోంది. 

 జనగామలో రహదారి వంతెన గోడకు వర్షపు నీరు పోయేందుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన పైపు మార్గం, రంధ్రాలే పిచ్చుకలకు ఆవాసంగా మారాయి. రంధ్రాల్లో గూళ్లు కట్టుకొని నివాసం ఏర్పరచుకుంటున్నాయి. సందడి చేస్తూ పిచ్చుకలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

కురుపాం మండలంలోని రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో కొత్త మొక్కలు దర్శనమిస్తున్నాయి. దుంప జాతి, పండ్లు, పూల రకాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి 300 వరకు పండ్ల మొక్కలను తీసుకొచ్చారు. 

సంక్రాంతి హరిదాసులు సాంకేతికత అందిపుచ్చు కుంటున్నారు. గతంలో తమ గాత్రంతో పాటలు పాడి అలరించేవారు. ప్రస్తుతం మైకు ద్వారా వాటిని వినిపిస్తున్నారు. నరసరావుపేటలోని ప్రకాష్‌నగర్‌లో హరిదాసు ఇంటింటా తిరుగుతూ కనిపించారు. 

చెన్నై రన్నర్స్‌ ఆధ్వర్యంలో చెన్నైలో మారథాన్‌ ఏర్పాటు చేశారు. ఈ మారథాన్‌లో అధిక సంఖ్యలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలో ముంబయి తర్వాత రెండో అతిపెద్ద మారథాన్‌ ఇది. 

నటీనటులు జెస్సి, సోనియా సింగ్, పవన్ సిద్దు, సాయిరాం భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(23-02-2024/2)

Eenadu.net Home