చిత్రం చెప్పే విశేషాలు
(06-01-2024/3)
చైతన్య రావు-హెబ్బా పటేల్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాలరాజశేఖర్ దర్శకుడు. శనివారం హెబ్బాపటేల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.
చైనాలోని హర్బిన్‌లో ‘హర్బిన్ ఐస్-స్నో వరల్డ్’ అనే పండుగ ఉత్సాహంగా జరిగింది. ప్రతీ ఏడాది శీతాకాలంలో ఈ పండుగను నిర్వహిస్తారు. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారు.
కోమట్ల గూడెం నుంచి గాదేపాడు వెళ్లే ఆర్ అండ్ బి రహదారి పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతోంది. ఎటు చూసినా వందలాది చెట్లతో చలువ పందిల్ల మాదిరిగా చెట్లు కనిపిస్తుండటంతో సుపరిచితులను ఆకట్టుకుంటున్నాయి.
రామంతపూర్‌లోని మెగా జూనియర్ కళాశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. ఆటపాటలతో సందడి చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్.. ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందించారు.
బంజారాహిల్స్‌లో పాల్కీ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈవెంట్‌కు సినీ నటి తేజస్విని, పలువురు మోడల్స్ హాజరై నూతన ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు.
గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ పాఠశాలలో ‘కాస్నివాల్’ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. ఈవెంట్‌కు యాంకర్ సుమ, నటుడు రోషన్ కనకాల హాజరై చిన్నారులతో కలిసి సందడి చేశారు.
రాజమహేంద్రవరం గైట్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు కమల హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనతో దిగిన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
వైఎస్ షర్మిల.. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంట్లో మర్యాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కొడుకు నిశ్చితార్థానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.