చిత్రం చెప్పే విశేషాలు

(09-01-2024/1)

దిల్లీలో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. క్రికెటర్‌ మహ్మద్‌ షమి అర్జున పురస్కారం అందుకున్నాడు.

 శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. 

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపకుడు రామ శ్రీనివాస్‌ మృతి చెందారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్‌రావు, కేటీఆర్‌ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. 

 గచ్చిబౌలిలోని ఓ మొబైల్‌ స్టోర్‌లో గ్జియామీ 5జీ నూతన మొబైల్‌ను సినీనటి హిమజ ప్రారంభించారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ.. తైమూర్‌-లెస్టే ప్రెసిడెంట్‌ జోస్‌ రామోస్‌ హోర్టాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, విద్య, ఇంధనం తదితర రంగాల్లో సహకారంపై చర్చించారు.  

రానున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాపై నోవాటెల్‌లో సీఈసీ సమావేశం నిర్వహించింది. దీనికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. 

 అక్షయ పాత్ర ఫౌండేషన్ రీజినల్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్ర దాస ప్రభు జీ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కార్యకలాపాల గురించి వివరించారు. 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని.. మంత్రి సీతక్క పరామర్శించారు. ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే.

చిత్రం చెప్పే విశేషాలు(25-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

Eenadu.net Home