చిత్రం చెప్పే విశేషాలు

(09-01-2024/2)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ‘రా.. కదలిరా’ కార్యక్రమం నిర్వహించారు. తెదేపా అధినేత చంద్రబాబు హాజరై ప్రసంగించారు.

హంగేరీలోని బాలాటన్‌ఫెనివ్స్‌లోని బాలాటన్ సరస్సును మంచు కప్పేసింది. అక్కడ బలమైన గాలులతో ఉష్ణోగ్రత మైనస్ 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.

హమాస్‌ అంతమే లక్ష్య్ంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా జరిపిన దాడుల్లో ఎన్నో భవనాలు నేలమట్టమయ్యాయి. 

నాగార్జున-ఆషికా రంగనాథ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘నా సామి రంగ’. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 

మహేషబాబు-శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా గుంటూరులో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. చిత్ర బృందం స్పెషల్ ఫ్లైట్‌లో గుంటూరు చేరుకుంది. 

 భారత్‌కు వచ్చిన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఘన స్వాగతం లభించింది. అనంతరం మోదీతో కలిసి మూడు కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. యాత్ర సాగే రహదారులపై కళా కార్యక్రమాలు నిర్వహించారు.

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు కారణంగా గుండెపోటుతో మరణించినవారి కుటుంబాలను పరామర్శించారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రెడ్‌మీ నూతన మొబైల్‌ను సినీనటి సిరి హనుమంతు ప్రారంభించారు. అనంతరం సెల్ఫీలు దిగి సందడి చేశారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తిని నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home