చిత్రం చెప్పే విశేషాలు

(11-01-2024/3)

హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌ వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విందు ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే తదితర దేశాల ప్రతినిధులు ఈ విందుకు హాజరయ్యారు.

వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 2024 కోసం గుజరాత్ వచ్చిన ప్రధాని మోదీ సమ్మిట్‌ ముగిసిన అనంతరం అహ్మదాబాద్‌లో ఫ్లవర్ షోను వీక్షించారు. సంబంధిత చిత్రాలను ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకున్నారు. 

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో రంగురంగుల చిత్రాలు, శిల్పాలు కొలువుదీరాయి. చండీగఢ్‌కు చెందిన చిత్రకారిణి రష్మితతోపాటు కోల్‌కతాకు చెందిన 9 మంది చిత్రకారుల బృందం వీటిని ఆవిష్కరించింది. 

ఏటా జరిగే టెక్‌ సందడి.. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో కొనసాగుతోంది. లాస్‌ వెగాస్‌లో ఈ నెల 9 నుంచి 14 వరకు ఈవెంట్‌ జరగనుంది. కార్యక్రమంలో ప్రదర్శించిన ఆసక్తికర గ్యాడ్జెట్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

బాలీవుడ్‌ స్టార్‌హీరో ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ వివాహం వేడుకగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వేదికగా బుధవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో ఐరా - నుపుర్‌ శిఖరే ఒక్కటయ్యారు. 

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నగరానికి మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు దక్కింది. దేశంలోని టాప్‌-10 నగరాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు.

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా ప్రారంభించారు. సినీనటి తేజస్విని, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై నూతన వస్త్రాలతో ఫొటోలకు పోజులిచ్చారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సంక్రాంతి ముందస్తు సంబరాలు మొదలయ్యాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ముగ్గులు వేసి ఆటపాటలతో సందడి చేశారు.

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home