చిత్రం చెప్పే విశేషాలు

(13-01-2024/3)

వైఎస్‌ షర్మిల.. తెదేపా అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. 

మాదాపూర్ శిల్పారామంలో సంక్రాతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాతి సందర్భంగా గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలు, కళాకారుల ప్రదర్శనలతో పండుగ వాతావరణం నెలకొంది.

ముంబయిలో ఎయిర్ షో సందర్భంగా మెరైన్ డ్రైవ్‌లో భారత వైమానిక దళం సూర్య కిరణ్ ఏరోబాటిక్స్ బృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, సంప్రదాయ వేషధారణలతో సంక్రాంతి ముందస్తు సంబురాలు అట్టహాసంగా జరిగాయి.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రయాణికులతో రద్దీ ఏర్పండింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ, రేల్వేశాఖ అదనపు సర్వీసులను నడుపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 105వ జయంతి వేడుకలను హైదరబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్‌ తమిళి సై పాల్గొన్నారు. 

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను ఘనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్‌ జరగనుంది. 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తెదేపా అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీట్ల కేటాయింపు గురించి చర్చించనున్నారు. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home