చిత్రం చెప్పే విశేషాలు

(14-01-2024/1)

విశాఖపట్నం జిల్లాలో సైనిక దుస్తులు ధరించినట్లు కనిపిస్తూ పచ్చటి ఆకుల్లో సేదతీరుతున్న కీటకమిది. రంగుల్లో మెరుస్తుండటంతో దీన్ని పేటలో పలువురు ఆసక్తిగా తిలకించారు.

విశాఖపట్నం జిల్లా సింహాచలం కొండపైకి వెళ్లే మార్గంలో పలు చోట్ల భారీ బండరాళ్లపై ఆధ్యాత్మిక పరమైన బొమ్మలు, కీర్తనలు ఆకట్టుకుంటున్నాయి. సింహగిరిపైకి వెళ్లే భక్తులను ఇవి ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

 కోయంబత్తూరు సమీప పొళ్లాచ్చిలో రాష్ట్ర పర్యాటకశాఖ తరఫున శనివారం బెలూన్‌ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 వరకు కొనసాగనున్న ఉత్సవాలకు బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్‌ సహా 8 దేశాలకు చెందిన వారు భారీ బెలూన్లతో విచ్చేశారు.

హైదరాబాద్‌లో శనివారం పరేడ్‌ మైదానంలో కైట్, స్వీట్‌ ఫెస్టివల్‌ మొదలుకాగా.. ఆదివారం పీపుల్స్‌ ప్లాజా, ఎన్టీఆర్‌ స్టేడియంలో పతంగుల పోటీలు షురూ కానున్నాయి. మాదాపూర్‌లోని శిల్పారామంలో గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసు కీర్తనలు ఆకట్టుకున్నాయి.

ఒడిశా పూరీ జగన్నాథ మందిరం నూతన కారిడార్‌ ప్రతిష్ఠోత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా శనివారం సైకత యానిమేషన్‌ తీర్చిదిద్దాడు. కొత్త కారిడార్, మందిరం, యజ్ఞం తదితర ఆకృతులను అందులో పొందుపరిచాడు.

విశాఖ నగరంలోని మురళీనగర్‌ ఎన్‌జీజీఓస్‌ కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత పోర్టుట్రస్టు ఉద్యోగి సత్యనారాయణ, అంబీశ్వరి దంపతుల నివాసంలో డాబాపైన కాండం మొదలుకుని 30 అడుగుల ఎత్తులో అరుదైన ఫాక్స్‌స్టైల్‌ జాతి కాక్టస్‌ మొక్క చిన్నచిన్న పువ్వులతో కనువిందు చేస్తోంది.

భోగభాగ్యాలనిచ్చే భోగి వచ్చేసింది. యువత చేసే సందడి చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఆదిలాబాద్‌ పట్టణంలో భోగి మంటలు వేసుకొని యువతులు సందడి చేసి సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు.

నిజామాబాద్‌ జిల్లాలో మహ్మద్‌నగర్‌ మండలం హాసన్‌పల్లి గ్రామానికి చెందిన బెస్త లక్ష్మణ్‌ రోజు మాదిరిగానే శనివారం నిజాంసాగర్‌ జలాశయంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వలకు సుమారు 20 కిలోల భారీ చేప చిక్కింది. భారీ చేప దొరకడం అరుదు కావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

సంక్రాంతి సందర్భంగా గండేపల్లిలో శనివారం పొట్టేళ్ల పోటీలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి తీసుకువచ్చిన పొట్టేళ్లు తలపడ్డాయి. గెలుపొందిన పొట్టేళ్ల యజమానులకు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ పోటీలు ప్రారంభించారు.

 పర్లాఖెముండి పట్టణంలోని కెవిటి వీధిలోని ప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం తిరుప్పావై సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి రూపాన్ని 42 కిలోల పులిహోరతో తీర్చిదిద్దారు. పురోహితులు రాజగోపాల ఆచారి పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

భువనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో గత రెండు రోజులుగా సంక్రాంతి సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆవరణలో పాత తరం ఇంటి నమూనా నిర్మించారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన యువతులు సంక్రాంతి ముగ్గులు వేసి సందడి చేశారు.

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home