చిత్రం చెప్పే విశేషాలు

(16-01-2024/1)

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లిలో ఖర్జూర కల్లుకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. సర్పంచి సామినేని రమేష్‌ ఇంటి ఆవరణలో పెంచుతున్న ఖర్జూర చెట్లు సైతం ఈత, తాటి చెట్ల మాదిరిగానే కల్లునిస్తున్నాయి. ఖర్జూర పండ్ల కోసం ఏడేళ్ల క్రితం నాటిన చెట్లల్లో నాలుగు కల్లునిస్తున్నాయన్నారు.

వికారాబాద్, అనంతగిరి అంటేనే ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. పచ్చటి వృక్షాలతో అలరారే ఈ అడవిలో జింకలు, దుప్పి, నెమళ్లు, రకరకాల పక్షులు, కోతులు..ఇవే కాకుండే తళుక్కున కంటికి కనిపించి పారిపోయే మరెన్నో జంతువులు మనుగడ సాగిస్తున్నాయి. 

బహదూర్‌పుర సుధాకార్‌ మ్యూజియం ఆవరణలో కదిలే అయోధ్య రామమందిరం రూపుదిద్దుకుంది. రెండేళ్ల క్రితం చేపట్టిన దీని నిర్మాణం తుదిదశకు చేరుకుంది. మెటాడోర్‌ వాహనంపై 216 ఫైబర్‌ స్తంభాలతో మందిర నిర్మాణం పూర్తి చేశారు. దీనికి¨ 307 ప్రీక్వెన్సీ ఫోర్స్‌తో కూడిన ఇంజిన్‌ ఉంది. 

 ప్రతి నెలా పింఛను కోసం వృద్ధులు తమ ఇళ్ల నుంచి చాలా దూరం వెళ్తున్నారని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు. దావణగెరె జిల్లా హరిహర తాలూకా కుణిబెళకెరె గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు పింఛను కోసం ప్రతి నెలా 5 కి.మీ. పాక్కుంటూ వెళ్తోందని తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. 

పలు ప్రాంతాల్లో భోగి మంటల కారణంగా గాలి కాలుష్యం అధికమైంది. చెన్నైలో దట్టమైన పొగ అలుముకుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇదే పరిస్థితి కనిపించింది. మంచుతో పాటు పొగ వ్యాపించడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కోడిగుడ్డు ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 6వ తేదీ వరకు డజను కోడిగుడ్లు రూ.66 కాగా, ప్రస్తుతం వాటి ధర రూ. 84కు చేరింది. అంటే ఒక్క గుడ్డు ధర రూ.7 పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 కి పైగా విక్రయిస్తున్నారు. 

ఇండోనేసియాలో మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం ఆదివారం మళ్లీ బద్దలైంది. గాల్లోకి భారీగా పొగ, బూడిదను ఎగజిమ్మింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 

కడియం పల్లవెంకన్న నర్సరీలో వినూత్న రీతితో ఏర్పాటు చేసిన సంక్రాంతి శుభాకాంక్షల ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 50 వేల రకాల మొక్కలతో దీన్ని తీర్చిదిద్దారు. వారంపాటు శ్రమించి ఏర్పాటు చేసినట్లు నర్సరీ అధినేత పల్ల సత్తిబాబు వివరించారు. 

మాంసాహార ప్రియులు ఇష్టంగా తినే పచ్చపీతల ధరలు మార్కెట్లో కిలో రూ.2400 పలుకుతున్నాయి. గతంలో ఈ రకం పీతలను ఆక్వా చెరువుల్లో సాగుచేసేవారు. వనామీ రొయ్యలకు సంక్రమిస్తున్న వైరస్‌ వ్యాధులు వీటికి కూడా సోకి మృత్యువాత పడుతుండటంతో సాగువిస్తీర్ణం తగ్గింది.

తూటిపాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు బి.రవికుమార్‌ తోటకూర గింజలతో రైతు, నాగలికి రూపమిచ్చాడు. సంక్రాంతి సందర్భంగా 20 గంటలపాటు శ్రమంచి 2700 తోటకూర గింజలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నాడు. 

వాడపాలెం మత్స్యకారులకు ఆదివారం భారీ తిమింగలం చిక్కింది. మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కడంతో చేపలు ఎక్కువగా పడ్డాయని సంబర పడ్డారు. తీరా ఒడ్డుకు చేరే సరికి అందులో తిమింగలం ఉంది. ప్రాణంతో ఉన్న దీన్ని సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home