చిత్రం చెప్పే విశేషాలు

(21-01-2024/1)

ఈ నెల 22న అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీమహాశక్తి ఆలయంలో 10 అడుగుల ఎత్తులో 15 అడుగుల వెడల్పుతో అయోధ్య రామాలయం రామనామ సంకీర్తన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

అయోధ్యలో నిర్మించిన రామాలయంలో ఈనెల 22న విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో మెదక్‌ జిల్లా హుస్నాబాద్‌లోని ఓ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శన నిర్వహించి భక్తిని చాటారు. జై శ్రీరాం అక్షరాల ఆకృతిలో కూర్చుని ఆకట్టుకున్నారు.

మామిడి కాయలు శీతాకాలంలో గుత్తులుగా కనిపిస్తూ చూపరులను ఆకర్షిస్తున్నాయి. విజయనగరం జిల్లా నెలిమర్ల మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో ఉన్న మామిడి చెట్టుకు అప్పుడే పూత రాగా.. పిందెలు దిగాయి. ఉద్యానశాఖ అధికారిణి జ్యోతి మాట్లాడుతూ పూనాస రకాల చెట్లు శీతాకాలంలోనూ దిగుబడినిస్తాయని చెప్పారు.

వచ్చే సీజన్‌లో విత్తనాలు సమకూర్చేందుకు ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో మూడు ఎకరాల్లో జొన్న సాగు చేశారు. అక్కడి పాలిటెక్నిక్‌ విద్యార్థుల క్షేత్రపర్యటన, శిక్షణలో భాగంగా వారం రోజులుగా వారితో స్వయంగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ బియ్యపు గింజలతో రామమందిరం ఆకృతిని రూపొందించారు. దాదాపు 16 వేల బియ్యం గింజలతో 60 గంటలపాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు. గతంలో విభిన్నమైన సూక్ష్మకళతో దయాకర్‌ గిన్నిస్‌ రికార్డు సాధించారు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన రామ భక్తుడు తన కళతో తన భక్తిని చాటుకుంటున్నారు. సైకత కళాకారుడు మనోజ్‌కుమార్‌ కాంచీపురం ఇసుకతో రాముడు, అయోధ్య మందిర నమూనాను వేశారు. ఆయన ఇదివరకు పలు రకాల చిత్రాలు ఇలా వేసి ఆకట్టుకున్నారు.

వినూత్నంగా ఉండాలనుకునే యువత కోసం మార్కెట్‌లోకి కొత్తగా ‘శిరస్త్రాణ తొడుగులు’ వచ్చాయి. ఇవి రకరకాల ఆకృతుల్లో లభిస్తున్నాయి. కుందేలు ఆకృతిలోని తొడుగును ధరించి విశాఖ జిల్లా భీమిలి బీచ్‌ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఈ యువకుడిని పలువురు ఆసక్తిగా చూశారు.

రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భలే ఉన్నాడే’ సినిమా షూటింగ్‌ శనివారం విశాఖ జిల్లా భీమిలి బీచ్‌ రోడ్డులోని తొట్లకొండ పార్కులో జరిగింది. మారుతీ టీం ప్రొడక్ట్‌ సంస్థ సమర్పిస్తోంది.ఈ చిత్రం షూటింగ్‌ ఉదయం నుంచి రాత్రి వరకు పార్కులోనే జరగడంతో రోజంతా సందడి నెలకొంది.

మియాపూర్‌, బొల్లారం నుంచి అమీన్‌పూర్‌, బీహెచ్‌ఈఎల్‌కు వెళ్లే రోడ్డు ఇది. కంకర తేలి దుమ్ములేచి దారి కనపడని పరిస్థితి నెలకొంది. ఈ దుమ్ములో రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు.

హైదరాబాద్‌ నగరంలో ఇంధన కాలుష్యం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. నిత్యం గాలి ఏ స్థాయిలో కలుషితమవుతుందో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ బోర్డు, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ వద్ద డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేశాయి.

చిత్రం చెప్పే విశేషాలు(27-07-2024)

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

Eenadu.net Home