చిత్రం చెప్పే విశేషాలు

(21-01-2024/2)

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇలా హనుమంతుడి వేషధారణ అబ్బురపరిచింది. 

తిరుమల శ్రీవారిని సినీనటి శ్రియ శరణ్‌ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  

అయోధ్యలో రేపు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అయోధ్యకు చేరుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. మహాత్మ జ్యోతిరావు పులె విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. 

చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మల్లన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో కొమురవెల్లి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.

బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ ప్రదర్శనను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు.

హైదరాబాద్‌ బ్లూ క్రాస్‌, మార్స్‌ పెట్‌ కేర్‌ ఆధ్వర్యంలో దోమలగూడలో ‘#లవ్‌ మై ఇండీ’ డాగ్‌ షో నిర్వహించారు. ఈ పెట్‌షోకు సినీనటి అమల హాజరై సందడి చేశారు. 

సోమవారం బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని అయోధ్య ముస్తాబైంది. అయోధ్య ఆలయ వీధులను పూలతో అలంకరించారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home