చిత్రం చెప్పే విశేషాలు

(25-01-2024/2)

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారులు, విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను చైతన్యపరుస్తూ.. ఫ్లకార్డులను పట్టుకొని నినాదాలు చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని దేవాలయాలను సినీనటుడు నవదీప్‌ దర్శించుకున్నారు. జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

ఉప్పల్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు అలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఒక వికెట్‌ వికెట్‌ కోల్పోయి 23 ఓవర్లకు 119 పరుగులు చేసింది.

నటి ఆషికా రంగనాథ్‌ సోదరి, నటి అనూష వివాహం ఇటీవల వేడుకగా జరిగింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో ఆమె ఏడడుగులు వేశారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆషిక తాజాగా అభిమానులతో పంచుకున్నారు.

నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా 

నారా భువనేశ్వరి అమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ‘హనుమాన్‌’ చిత్ర టీమ్‌ను అభినందించారు. ఆకట్టుకునే విజువల్స్‌తో ప్రశాంత్‌ వర్మ కొత్త ప్రపంచాన్ని సృష్టించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.   

అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం గురువారానికి 1500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.  

ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవెల్‌ లీడర్స్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మేల్యేలు హాజరయ్యారు.

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(23-02-2024/2)

Eenadu.net Home