చిత్రం చెప్పే విశేషాలు

(26-01-2024/1)

 జెండా పండగ వచ్చిందంటే పిల్లలకు సందడే సందడి. మువ్వన్నెల జెండాలతో సరదాసరదాగా ఆడుకుంటూ మురిసిపోతారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు ఇసుకలో ఇలా జెండాలు ఎగరేస్తూ కనిపించారు.

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో గాలిపటాల శ్రీనివాస్‌ వినూత్నంగా గాలిపటాన్ని తయారుచేశారు. 75 సంవత్సరాలను పురస్కరించుకొని 75 అడుగుల తోకతో ఎగురవేశారు. జాతీయజెండా రంగులతో తీర్చిదిద్ది దేశాభిమానాన్ని చాటుకున్నారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీలోని బచ్‌పన్‌ స్కూల్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో చిన్నారులు పాల్గొని సందడి చేశారు. 

గణతంత్ర దినోత్సవ సన్నాహాల్లో భాగంగా జహీరాబాద్‌ పట్టణం ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో గురువారం వంటల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు 90కి పైగా రకాల వంటలను ప్రదర్శించారు. 20కి పైగా రకాల మిఠాయిలు, బిర్యానీలు, రొట్టెలు, చిరుధాన్యాలు, కూరగాయలతో కూడిన రకరకాల వంటలను తీసుకువచ్చారు.

కె.కోటపాడు మండలం గుల్లిపల్లి నుంచి గొండుపాలెం వెళ్లే దారిలో రోడ్డు పక్కనున్న ఓ చెట్టు నిండా పూలే కనిపిస్తున్నాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారిని ఎరుపు రంగులో ఉన్న ఈ పూలు ఆకట్టుకుంటున్నాయి.

సాధారణంగా మామిడి చెట్టు జనవరి నెలలో పూతకు వస్తుంది. చెట్టు మొత్తం ఒకే సారి పూస్తుంది. సొనాల నుంచి చింతలబోరి వెళ్లే మార్గంలో పార్డి-బి వద్ద రహదారి పక్కనే ఉన్న ఓ మామిడి చెట్టు కేవలం సగం మాత్రమే పూతతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియంలో కాంగ్రెస్‌ సభ ముగిసిన తర్వాత పరిసరాల్లో ట్రాఫిక్‌ స్తంభించడంతో ఆ ప్రభావం సచివాలయ పరిసరాల్లోనూ కనిపించింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పక్కన రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.

ప్రకృతి అందాలు ఒక వైపు, కాకతీయ కళాతోరణం మరోవైపు ప్రయాణికులను, చూపరులను తెగ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్, వరంగల్‌ జాతీయ రహదారిపై జనగామ, భువనగిరి యాదాద్రి జిల్లాల సరిహద్దులో నిర్మించిన చారిత్రాత్మకమైన కళాతోరణం వద్ద పరుచుకున్న పచ్చదనం, పచ్చని మొక్కలు ఆ ప్రాంతాన్ని ఆకర్షిస్తోంది.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని రాజాజీనగర, వైట్‌ఫీల్డ్‌లోని ఓరాయన్‌ మాల్స్‌లో కళాకారుడు పూజారి అక్షయ్‌ జాలిహళ్‌ రూపొందించిన రంగోలి చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ముగ్గు పిండి, రంగులను ఉపయోగించి 20×20 అడుగుల విస్తీర్ణంలో వేశారు. 

సాధారణంగా పెంకులను ఇంటి పైకప్పుపై పరుస్తారు. ఇక్కడ చిత్రంలో కోనికల్‌ టైల్స్‌(కూజా పెంకులు)ను మాత్రం లోపల సీలింగ్‌కు అమర్చుతారు. ఇవి వేడిని లోనికి రాకుండా నియంత్రించి ఇంటిని చల్లగా ఉంచుతాయి. 

ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ గురువారం పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ హక్కు వినియోగించుకోవాలని సందేశమిచ్చారు.

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home