చిత్రం చెప్పే విశేషాలు

(26-01-2024/2)

అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి.. పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపిక కావడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు.

నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ తమిళి సై జెండా ఎగురవేశారు. అంతకముందు గవర్నర్‌కు సీఎం రేవంత్‌ స్వాగతం పలికారు. 

దిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి

హైదరాబాద్‌లోని నాలెడ్జ్‌ సిటీలో శుక్రవారం ఘనంగా ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌’ నిర్వహించారు. నగరవాసులు, ప్రముఖులు హాజరై సందడి చేశారు.

దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నిస్వార్థంగా మన దేశాన్ని రక్షించిన వారిని మనం స్మరించుకోవాలని పేర్కొ్న్నారు. 

నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. 

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 130 మంది చిత్రకారులతో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన చూడటానికి భారీగా సందర్శకులు వచ్చారు. 

మాస్‌ మహరాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్‌ బచ్చన్‌ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. సంబంధిత పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంది. 

‘పద్మ విభూషణ్‌’ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా చిరంజీవి.. వెంకయ్యనాయుడిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ‘ఆయన నాకు అభినందనలు తెలపడం చాలా ఆనందంగా ఉంది’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(23-02-2024/2)

Eenadu.net Home