చిత్రం చెప్పే విశేషాలు

(28-01-2024/2)

‘అల.. వైకుంఠపురములో’ తో తెలుగువారికి పరిచయమైన నటుడు గోవింద్‌ పద్మసూర్య వివాహం చేసుకున్నారు. మలయాళీ సీరియల్‌ నటి గోపికా అనిల్‌ను కేరళలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.  

 హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద 5కె, 10కె, 21కె రన్‌ ప్రారంభించారు. పోలీసు ఉన్నతాధికారులు, నగరవాసులు ఉత్సాహంగా హాజరయ్యారు.

‘మిస్‌ పర్ఫెక్ట్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖపట్నంలో సందడి చేశారు నటి లావణ్య త్రిపాఠి. ఈ సందర్భంగా వైజాగ్‌ బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో మంగళ గౌరి నూతన వస్త్ర దుకాణాన్ని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరీ ప్రారంభించారు. వివిధ రకాల కంచి సిల్క్‌ శారీలతో మహిళలు ఫొటోలు దిగి సందడి చేశారు.

విశ్వక్‌ సేన్‌-చాందినీ చౌదరీ జంటగా నటిస్తోన్న చిత్రం ‘గామి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

హైదరాబాద్‌లో ‘హామ్లీస్‌ ప్లే’ షాప్‌ను అల్లు స్నేహారెడ్డి ప్రారంభించారు. వివిధ రకాల బొమ్మలు, ఆట వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అల్లు అర్హ, చిన్నారులు హాజరై సందడి చేశారు.

హైదరాబాద్‌లో హెచ్‌పీఎస్‌ఎల్‌ మై సౌత్‌ దివా క్యాలెండర్‌-2024ను ఆవిష్కరించారు. సినీ నటుడు విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోడల్స్‌ హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.  

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని.. రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home