చిత్రం చెప్పే విశేషాలు

(30-01-2024/1)

 తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్‌ చేసిన చిరంజీవి సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘కనిపించే దేవత, కని పెంచిన అమ్మకు ప్రేమతో’ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీకి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నివాళి అర్పించారు.

రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం బిహార్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్‌ అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. 

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘హనుమాన్‌’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో ప్రతి సన్నివేశం ఆకట్టుకుందని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.  

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను సినీనటుడు మోహన్‌ బాబు పరామర్శించారు. ఇటీవల ఇళయరాజా కుమార్తె మృతి చెందిన విషయం తెలిసిందే.  

గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుందని చిత్రబృందం పేర్కొంది. 

దేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దిల్లీలో మంగళవారం దట్టంగా పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారిలకు ప్రముక సినీ నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నివాసంలో వారికి శాలువా కప్పి సత్కరించారు. 

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(23-02-2024/2)

Eenadu.net Home