చిత్రం చెప్పే విశేషాలు

(30-01-2024/2)

జాతిపిత గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నివాళి అర్పించారు.

తిరుమల వేంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడు, పాలకమండలి సభ్యుడు సీతారామిరెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు పురుషోత్తం రెడ్డి ఉన్నారు.

శంషాబాద్‌లో చినజీయర్‌ స్వామిని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కలిశారు. శ్రీరామనగరంలో చినజీయర్‌ స్వామితో మోహన్‌ భాగవత్‌ సమావేశమయ్యారు.

దిల్లీ విజయ్‌ చౌక్‌లో గణతంత్ర వేడుకల ముగింపు చిహ్నంగా బీటింగ్‌ రీట్రీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము అధికారులతో మాట్లాడారు.  

నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర మంగళవారం బాపట్ల జిల్లాలో కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.

చిత్తూరు నగరంలోని జీఎం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంటు బల్లలను ఏర్పాటు చేశారు. వీటిని నగరపాలక సిబ్బంది, పోలీసులు తొలగించడం చర్చనీయాంశమైంది. 

మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్‌ బాపూ ఘాట్‌లో గాంధీజీకి నివాళులు అర్పించారు.

తిరుపతి జిల్లా సత్యవేడు వైకాపా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మంగళవారం ఆయన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో లోకేశ్‌తో సమావేశమయ్యారు

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home