చిత్రం చెప్పే విశేషాలు

(01-02-2024/3)

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శ్రీశైలంలో పర్యటించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి, దేవాన్షులతో కలిసి పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్‌ పట్టణంలో ప్రజా గాయకుడు గద్దర్‌ విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బుధవారం రాత్రి ఆవిష్కరించారు.  

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, తదితర అధికారులు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా ముర్ము.. నిర్మలాకు శుభాకాంక్షలు తెలిపారు.

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించి, చెక్కులు అందజేశారు.  

హీరో నిఖిల్‌ త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. 

రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 31, 2024 వరకు ఈ అమృత్ ఉద్యానం సందర్శకులకు అందుబాటులో ఉండనుంది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఆయనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు.

సినీ హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా సినీనటుడు నాగబాబు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.  

చిత్రం చెప్పే విశేషాలు(05-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(04-07-2025)

Eenadu.net Home