చిత్రం చెప్పే విశేషాలు

(02-02-2024/2)

భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. పుట్టుకతో మూగ, చెవుడుతో బాధపడుతున్న ఓ బాలుడి వైద్యానికి ఆర్థిక సహాయం అందించారు. ఘట్‌కేసర్‌లోని వారి నివాసానికి వెళ్లి చెక్కును అందజేశారు.  

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె పలు కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేశారు.  

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. 

భారత్‌లోని కశ్మీర్‌, ధర్మశాలతోపాటు అమెరికాలోని కాలిఫోర్నియా, అలస్కా ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో ఇళ్లు, రహదారులపై మంచు పేరుకుపోతోంది.

దిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కలిశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

విశాఖపట్నం వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు (93 ఓవర్లు) చేసింది.

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్‌ జరగనుంది. అందాల భామలు హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. 

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(23-02-2024/2)

Eenadu.net Home