చిత్రం చెప్పే విశేషాలు
(05-02-2024/2)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఝార్ఖండ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ బొగ్గు కార్మికుడి దగ్గర సైకిల్ తీసుకుని రాహుల్ గాంధీ తొక్కారు.
భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్పర్ష్ హోస్పైస్‌లోని క్యాన్సర్ బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యంగా ఉండాలని తెలిపారు.
. గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచదేశాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. భారత రత్నకు ఎల్‌కే ఆడ్వాణీ ఎంపికైన విషయం తెలిసిందే.
మూడు రోజులుగా కార్చిచ్చు చిలీని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకు వందల మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఖరారు చేస్తూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
రుత్విక్, విశాఖ దిమాన్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రాజా ది రాజా’. ఈ సినిమా షూటింగ్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లాప్ కొట్టి ప్రారంభించారు.
అనకాపల్లి జిల్లా మాడుగులలో తెదేపా ‘ రా.. కదలిరా..’ బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు.
మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మేడారం సమ్మక్కను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.