చిత్రం చెప్పే విశేషాలు

(06-02-2024/2)

బంజారాహిల్స్‌లో హైలైఫ్ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఎగ్జిబిషన్‌లో సినీ నటీమణులు కుషితా కల్లపు, రాశీ సింగ్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై సందడి చేశారు.

చిత్తూరు జిల్లాలో ‘రా కదలి రా’ సభ జరిగింది. ఈ సభకు తెదేపా అధినేత చంద్రబాబు మఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 

నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర మంగళగిరిలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె పలు కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేశారు. 

మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ 3 నెలల విరామం అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆడ్వాణీ భారత రత్నకు ఎంపికైన నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

జపాన్ రాజధాని టోక్యోలో మంచు విపరీతంగా కురిసింది. దీంతో రోడ్లపై మంచు పేరుకుపోవడం, నీరు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకయ్యనాయుడు పద్మవిభూషణ్‌కు ఎంపికైన నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

 భువనగిరిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. బాలికల ఆత్మహత్యలను ఖండిస్తూ.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ, విద్యార్థులు నిరసన తెలిపారు. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home