చిత్రం చెప్పే విశేషాలు

(09-02-2024/1)

మేడారం జాతరను సందర్శించే వీఐపీలకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా జ్ఞాపికలు అందిస్తుంటారు. ఈ మేరకు సమ్మక్క-సారలమ్మ వద్ద ఉండే మేడారం తరహాలోని 200 గద్దెలను ఇక్కడి కళాకారులు తీర్చిదిద్దారు. వీటిని జాతరలో ప్రత్యేక ఆకర్షణగా స్టాల్‌లో ఉంచనున్నారు. అవకాశం మేరకు భక్తులకు విక్రయించే వీలుంది.

కూకట్‌పల్లి నియోజకవర్గ కూడళ్ల అభివృద్ధిలో భాగంగా కేపీహెచ్‌బీ రాజీవ్‌ సర్కిల్‌ నెక్సా మాల్‌ వద్ద ఏర్పాటు చేసిన టవర్‌ ఇది. దీనిపై ఇటీవల నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయం, అంబేడ్కర్‌ భారీ విగ్రహం, కాళేశ్వరం ప్రాజెక్టు, నగరంలో ఉన్న పలు వంతెనల బొమ్మలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయపల్లి పంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఇప్ప ఎల్లయ్య వీధులను శుభ్రం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కొబ్బరి ఈనెలతో తయారు చేసిన పది చీపుర్లను తన ద్విచక్రవాహనం వెనుక భాగంగా అమర్చుకొని వీధుల్లో తిరుగుతూ శుభ్రం చేస్తున్నారు.

ఎన్సాన్‌పల్లి ఊరచెరువు నిండి గుడిలోకి చేరిన జలం మల్లన్నసాగర్‌ జలాలు సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి ఊర చెరువు నిండటంతో మత్తడి దూకుతోంది. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

పర్యావరణ హితం కోసం, ఆరోగ్యంపై శ్రద్ధనో లేక నిత్యం ట్రాఫిక్‌ జాం, చలానాలు, పార్కిగ్‌ కష్టాలు ఇవన్నీ ఎందుకు అనుకున్నాడేమో గానీ.. ఓ వ్యక్తి సైకిల్‌పైనే విధులకు వెళ్తున్నారు. కూకట్‌పల్లి వైజంక్షన్‌ వద్ద అంబేడ్కర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద కనిపించిన దృశ్యం.. పలువురిని ఆలోచింపజేస్తుంది. 

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో జీఎస్‌ఐ ఎక్స్‌పో-2024 ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్తువులు, పరికరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఒక రైలు పిల్లర్ల మీద ఆకాశంలో పయనిస్తే, మరో రైలు నేలపై ఏర్పాటు చేసిన పట్టాలపై గమ్యం వైపు పరుగులు తీస్తున్నాయి. చాదర్‌ఘాట్‌ వద్ద ఎంఎంటీఎస్, వంతెనపై మెట్రో పరుగులు పెడుతుండగా కెమెరాకు చిక్కిన దృశ్యమిది.

గుణదల మేరీమాత ఆలయ వంద వసంతాల ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా చర్చిని, మేరిమాత విగ్రహాన్ని, గుణదల కొండను విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయం కాంతులీనుతూ విశ్వాసులను ఆకట్టుకుంటోంది.  

రాజమహేంద్రవరం నగరాన్ని గురువారం మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం తొమ్మిదైనా నగర దారుల్లో 50 మీటర్ల దూరంలో ఎవరెళ్తున్నారో కనిపించనంతగా పొగ మంచు చుట్టేసింది. ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంచు సోయగం కట్టిపడేసింది. పుష్కరాల రేవులోని వంతెనల ప్రాంతం లంబసింగిని తలపించింది.

గడప గడపకు అంటూ ఏడాది కిందట ఆస్పరి మండలం పుప్పాలదొడ్డికి మంత్రి గుమ్మనూరు జయరాం వచ్చారు. జనాలు ‘జల’ కష్టాలు పరిష్కరిస్తామంటూ ఊరు దాటారు. నేటికీ నీరు ఇవ్వలేకపోయారు. వచ్చే కొద్దిపాటి నీటిని పట్టుకోవడానికి గ్రామస్థులు మూడు చక్రాల బండ్లతో మినీ ట్యాంకు వద్ద బారులు తీరుతున్నారు.  

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home