చిత్రం చెప్పే విశేషాలు

(11-02-2024/1)

ఈసారి వేసవి తీవ్రత ఫిబ్రవరిలోనే మొదలయ్యింది. అందుకే వేసవిలో వచ్చే మట్టికుండల అమ్మకం అప్పుడే మొదలయ్యింది. ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో కూజాలు, కుండలను విక్రయించేందుకు తీసుకొచ్చారు.

చెట్టు తొర్రలోకి వెళ్లడానికి రెండు రామచిలుకలు ప్రయత్నించాయి. అదే సమయంలో చెట్టు తొర్రలో నుంచి అకస్మాత్తుగా ఉడత బయటకు వచ్చింది. దీంతో రామచిలుకలు భయంతో అక్కడి నుంచి ఎగిరిపోయాయి. 

దువ్వూరు వద్ద నెల్లూరు- ముంబయి జాతీయ రహదారి సమీపంలోని ఒక స్థలంలో నూతనంగా దుకాణం నిర్మించారు. దానికి అడ్డుగా తాటి చెట్టు ఉంది. సంబంధిత యజమాని దాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఇనుప రేకులను దాని చుట్టూ ఏర్పాటు చేశారు. దీంతో ఇది స్థానికులను ఆకట్టుకుంటోంది. 

దేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మరో ప్రజా చైతన్య యాత్రకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి శంఖారావం యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం రాజావారి మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 

జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో జేజేవీజేజే వలయ కపూర్తలా సంస్థ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ షో జరిగింది. ఈ షోలో డిజైన్లు రూపొందించిన వివిధ రకాల వస్త్రాలను, వస్తు ఉత్పత్తులను ప్రదర్శించారు. డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను ధరించి మోడళ్లు చేసిన ర్యాంప్‌వాక్‌ ఆకట్టుకుంది. 

నల్గొండ పట్టణ శివారులోని ఛాయాసోమేశ్వర ఆలయం ప్రాంగణంలో నీటి కొలను ఉంది. అందులో తెల్లటి బాతులు విహారం చేస్తుంటాయి. ఆలయానికి వచ్చే భక్తులు కొలను వద్ద కూర్చొని సేదతీరుతూ..బాతులను గమనిస్తూ ఆనందం పొందుతున్నారు.   

పెద్దపల్లి రిక్రియేషన్‌ క్లబ్‌ నిర్వాహకులు మాత్రం దాదాపు 20 ఏళ్ల కిందట క్లబ్‌ భవనంపై రెండో అంతస్తు స్లాబ్‌ నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మ భాగం వరకు కప్పు వేయకుండా వదిలేశారు. ఇప్పుడా చెట్లు పెరిగి ఆవరణలో చల్లని నీడతో ఆహ్లాదకరంగా మారింది.

పుదుచ్చేరిలో వ్యవసాయశాఖ తరఫున 34వ పువ్వులు, కూరగాయల ప్రదర్శన బొటానికల్‌ గార్డెన్‌లో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రంగస్వామి ప్రారంభించారు. 25 వేలకుపైగా పలు రకాల పువ్వులు, పలు రకాల కూరగాయలతో రూపొందించిన కళారూపాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 

స్వామి వివేకానంద 1897 ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు ట్రిప్లికేన్‌లోని వివేకానంద హౌజ్‌లో బస చేశారు. ఏటా ఈ రోజుల్లో ఆయన జ్ఞాపకార్థంగా వేడుకలు జరుగుతుంటాయి. అందులో భాగంగా శుక్రవారం వివేకానంద హౌజ్‌ను విద్యుద్దీపాలతో అలంకరించారు.

చిత్రం చెప్పే విశేషాలు(24-02-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (24-02-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(23-02-2024/2)

Eenadu.net Home