చిత్రం చెప్పే విశేషాలు
(11-02-2024/2)
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలాస నియోజకవర్గంలో ‘శంఖారావం’ పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెదేపా కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
బాలికల సాధికారత కోసం సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ ఉత్సాహంగా సాగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు.
విజయవాడలో గత మూడు రోజులుగా జరుగుతున్న గుణదల మేరీ మాత శతాబ్ది మహోత్సవాలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన పోప్ వాటికన్ రాయబారి లియోపొల్దొ జిరెల్లి భక్తులకు సందేశమిచ్చారు.
కట్ట మైసమ్మ జాతర సందర్భంగా జీడిమెట్ల నర్సాపూర్ రహదారిపై ఉన్న కట్ట మైసమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. బోనాలు, ఒడి బియ్య అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టు జెర్సీని సినీహీరో విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘క్వియర్ స్వాభిమాన యాత్ర’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. నగరవాసులు, యువతీ యువకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఫ్లకార్డులుతో ర్యాలీ నిర్వహించారు.
చిత్తూరు జిల్లా నగరిలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆదివారం ఓం శక్తి ఆలయం నుంచి టవర్ క్లాక్ వరకు రోడ్ షో నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.