చిత్రం చెప్పే విశేషాలు

(13-02-2024/1)

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తెదేపా శంఖారావం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరై మాట్లాడారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు విషయాలు గురించి చర్చించారు.

దేశ రాజధాని దిశగా అన్నదాతలు కదిలారు. తమ డిమాండ్లను నెరవేర్చుకునే లక్ష్యంతో మంగళవారం పంజాబ్‌, హరియాణా నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో నగరానికి వచ్చి నిరసన తెలిపారు.  

రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీహీరో సాయిధరమ్‌ తేజ్‌ పాల్గొని మాట్లాడారు.

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ యూఏఈకి చేరుకున్నారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌తో భేటీ అయ్యారు. 

వరల్డ్‌ ఫొటోగ్రఫీ ఆర్గనైజేషన్‌, సోనీ సంయుక్తంగా సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ అవార్డులు, 2024ను ప్రకటించాయి. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన 3.95 లక్షల ఫొటోల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులను ప్రకటించాయి.

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేశారు. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home